Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ -నార్కట్పల్లి
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు ,మంచి నీటి బిల్లుల పేరుతో సర్పంచులను వేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15 ,16 సహజ నిధులను జిల్లా కలెక్టర్లు , డీపీఓలు సర్పంచ్ లను బెదిరించి చెక్కుల ద్వారా నిధులు వెనక్కి తీసుకుంటున్నారని , వ్యవస్థను మార్చేందుకు రాష్ట్రంలో సర్పంచులు అఖిల పక్షం గా ఏర్పడి ప్రభుత్వం పై తిరగబడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక హోటల్ వివేరా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచులు పార్టీ గుర్తు మీద గెలవలేదన్నారు. సర్పంచ్ పై నమ్మకంతో కేవలం రాజకీయ పార్టీల సహకారంతో గెలు పొందారని అఖిల పక్షం గా ఏర్పడి ప్రభుత్వం పై తిరగబడితేనె ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పారు . ఉపాధి హామీ ద్వారా వైకుంఠ దామాలు, రైతు వేదికలను కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులతో సర్పంచులు నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన 50 శాతం రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు రాకపోవడంతో అప్పులపాలై 25 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి 50 వేల కోట్లు అప్పులు చేసి మిషన్ భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం ఏ ఒక్క గ్రామంలో కూడా ఇంటింటికి నీళ్లు రావడం లేదని విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను కొనుగోలు చేయడంలో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ని రైతులు ఆవేదన వ్యక్తం చేసుకుంటే మిల్లర్ లను ఎడమ కాలి చెప్పుతో కొట్టాలని అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం రూ. 1960 చెల్లిస్తామని చెబుతుందని, మిల్లర్లు రూ.1200-1300 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం భువనగిరి , వలిగొండ రామన్నపేట నార్కట్ పల్లి ప్రాంతాలలో కాల్వ కింద వరి తప్ప వేరే ఇతర పంటలు వేయడానికి జాలు వస్తుందని తద్వారా వేరే పంటలకు అవకాశం లేదన్నారు .వరి వేస్తే రైతుబంధు ఇవ్వమంటూ పత్రికల్లో వచ్చిందని రైతులకు రైతుబంధు ఉచిత కరెంటు ఎల్లప్పుడూ అందిస్తామని అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ఇతర పథకాల మాదిరిగానే రైతులను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. నిరుద్యోగులను రైతులను, ప్రజలను, పాలకులను మోసం చేస్తున్న ప్రభుత్వం కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య,ఎంపీటీసీ ఫారం జిల్లా అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిగూడం ఉప సర్పంచ్ వడై భూపాల్ రెడ్డి జిల్లా నాయకులు జర్రిపోతుల భర త్ సర్పంచ్ నూ కల శంకర్ మాజీ ఎంపీటీసీ సిగ విష్ణు యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా చిన్న సూరబోయిన ప్రసాద్, శ్రీపతి గణేష్ పాల్గొన్నారు