Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కనగల్లు మండలం బోయినిపెల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి ,కనగల్లు మండల కార్యదర్శి కందుల సైదులు, మండల సహయకార్యదర్శి కానుగు లింగుస్వామి, మండల కమిటీ సభ్యురాలు సుల్తానా, పార్టీ మండల కమిటీ సభ్యులు సోము ముత్యాలు, పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పర్సనబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.