Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూర్
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కషితో తుంగతుర్తి నియోజకవర్గం అభివద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, జెడ్పీటీసీ గొరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పోన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శులు గిరగాని శ్రీను, గజ్జి మల్లేష్, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మీ, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు కూరెళ్ల కుమారస్వామి, గనగాని నర్సింహ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సోంమల్లు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండల కేంద్రంలోఅంబేద్కర్ చౌరస్తా వద్ద తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను టీిఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి , ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , జెడ్పిటిసి శ్రీరాముల జ్యోతి అయోధ్య , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ , జడ్పి కోఆప్షన్ సభ్యులు జోసెఫ్ , మండల ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి , మండల కో ఆప్షన్ సభ్యులు అంతోనీ , మండల యువజన విభాగం అధ్యక్షులు లింగాల అశోక్ , టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్ , మండల ప్రధాన కార్యదర్శి మార్తా రమేష్ యాదవ్ , యువజన విభాగం జిల్లా నాయకులు గూడెపు పరమేష్ , తదితరులు పాల్గొన్నారు.