Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపీటీసీ మట్టపల్లి కవిత కుమార్, ఉప సర్పంచ్ మోదాల పరమేష్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లెపాక రాములు, పాలడుగు జలంధర్, గుడిపాటి వీరయ్య, ఎస్కే.యాకుబ్, యాదగిరిరెడ్డి, చిట్యాల మల్లయ్య, గడ్డం సోమేష్, పరుశరాములు, మహేష్, మల్లె పాక రవీందర్, సోమక్క, ఉపాధ్యాయులు, చంద్రశేఖర్, గురువయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
చివ్వేంల : ఎమ్మెల్యే గాదరి కిషోర్ జన్మదినం సందర్భంగా నాయకులు పన్నాల సైదిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆలేటి ఆటం వరల్డ్‌లో అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కాందాల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, తడూరి లింగయ్య, బద్దం ప్రశాంత్‌రెడ్డి, రేసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల అర్వపల్లి, దేవాలయ చైర్మెన్ చిల్లంచెర్ల విద్యాసాగర్, రైతుబంధు సమన్వయ సమితి మండల నాయకులు పి.నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కడారి నరేష్, బి.రామలింగయ్య, కనుక శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు, పి.వెంకటయ్య పాల్గొన్నారు.
నాగారం : ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా శాంతినగర్ టీఆర్ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ నజీర్పాష ఆధ్వర్యంలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీహెచ్.శ్రీరామ్, పి.మంజుల, గ్రామ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు షేక్ హుస్సేన్, జానీపాషా, నాగుల్‌మీరా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మద్దిరాల : ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, కన్నా వీరన్న, నేండ్ర మల్లారెడ్డి, ఎంపీటీసీ సిరంశెట్టి వెంకన్న, సర్పంచులు లావుడియ వెంకన్న, వెలుగు వెంకన్న, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోల్కొండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి రూరల్ : ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదానం చేశారు. సాయిబాబా మందిరంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, కల్లెట్లపల్లి శోభన్, నరోత్తంరెడ్డి, తిరుమని యాదగిరి, మూల అశోక్‌రెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, దూపటి అంజలి, రవీందర్, పాలెపు చంద్రశేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెయిన్ రోడ్డు వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గోపగాని రమేష్‌గౌడ్, దేవాదాయ చైర్మెన్ ముత్యాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు గోపగాని వెంకన్న, గోపగాని శ్రీను, కటకం వెంకటేశ్వర్లు, ఎల్లబోయిన బిక్షం, తడకమళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్ : స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి భక్తుల సాయిల్‌గౌడ్, ఎంపీపీ బోర్రెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కలకడ వెంకన్న, వైస్ ఎంపీపీ జక్కి పరమేష్, వెంకన్న, ఎంపీటీసీ పన్నాల రామ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పన్నాల సైదిరెడ్డి, బత్తుల విద్యాసాగర్, తాడూరి సైదులు, కొంపల్లి మల్లరాంరెడ్డి, బాణాల సత్యనారాయణరెడ్డి, గార్డుల లింగరాజు తదితరులు పాల్గొన్నారు.