Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- క్రైస్తవులకు దుస్తులు పంపిణీ
నవతెలంగాణ - సూర్యాపేట
తెలంగాణలో సర్వమతాలూ సమానమని, అందరి మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ కనుక దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాదించున్న తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. క్రైస్తవ సోదరుల మనోభావాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న పాత చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణం, స్మశానాలను అభివద్ధి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు నియోజక వర్గాలకు క్రైస్తవ సోదరులకు పండుగ కనుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకట నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ లలితాఆనంద్, ఆర్డివో రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, తహశీల్దార్లు, పాస్టర్లు పాల్గొన్నారు.