Authorization
Sun April 13, 2025 07:45:55 pm
- గాయం ఒకటి చికిత్స మరొకటి
- శవంతో ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు బంధువులు ధర్నా
- బాధితులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ -నల్లగొండ
నిర్లక్ష్యపు వైద్యంతో వ్యక్తి మతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి కిషన్ కాలుకు గాయం కావడంతో 5 రోజుల క్రితం పట్టణంలోని ప్రకాశం బజార్లో ఉన్న సురక్ష మల్టీస్పెషాలిటి ఆస్పత్రిలో చేరాడు . కాలికి తగిలిన గాయానికి అందివ్వాల్సినంత వైద్యం ఇవ్వకుండా కేవలం డబ్బుల కోసం ఓవర్డోస్ వైద్యం చేశారు. రోగికి ఓవర్డోస్ ఎక్కించడంతో నరాలలో రక్తం గడ్డకట్టడంతో శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన 5నిమిషాల లోపే కుప్పకూలి మతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం తోనే వ్యక్తి మతి చెందాడని ఆగ్రహిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, వివిధకుల సంఘాల నాయకులు శవంతో మతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున ఆస్పత్రికి చేరుకొని మతుని కుటుంబ సభ్యులను బంధువులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి మతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కోసం పోలీస్ బందోబస్తుతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మతిచెందిన చిరుమర్తి కిషన్ భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీరాభిమాని.