Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోటకొండూరు
మండల పరిధిలోని మాటూరు గ్రామ ప్రాధమిక పాఠశాల పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు (1954-74) మేడి నారాయణ రావు జ్ఞాపకార్ధం వారి కుమారులు మేడీ హరినాథ్ శుక్రవారం పాఠశాలకు రూ.లక్షా50వేల విలువగల పరికరాలను అందజేశారు. సాంసంగ్ టీవీ, ప్రింటర్, డ్రమ్స్ స్పీకర్స్, కథలా పుస్తకాలు, క్యారామ్ బోర్డ్, వాలీబాల్ వంటి ఇతర వస్తువులు ఉన్నాయి. అనంతరం హరినాథ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న స్కైలాబ్ రెడ్డి, ,ఉపాధ్యాయులు వి. రాణి పి. ఇలియాస్ ఎస్ఎంసీ చైర్మెన్ బండ్రు స్కైలాబ్ రెడ్డి , పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.