Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
జనవరి 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య కోరారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ 22న బహిరంగ సభలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బి.వి .రాఘవులు , రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితర రాష్ట్రనాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరిశ్రీనివాసు, మండల కమిటీ సభ్యులు ఐతరాజు నర్సంహా,రుద్రారం పెద్దలు, నెలికంటి నర్సింహా, లడె రాములు, మేడి సుగుణమ్మ, వీరమల్ల చంద్రమౌళి, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.