Authorization
Sat April 12, 2025 10:59:30 am
నవతెలంగాణ -ఆలేరటౌన్
మండల కేంద్రంలో రైల్వేగేట్ వద్ద అండర్పాస్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ స్థానికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైల్వే గేట్ అండర్ పాస్ మూసేసి రెండేండ్లు పూర్తి అయిందన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తునికి దశరథ, ఎండి సలీం, గుండు మధుసూదన్, ఎండి.రఫీ, ఎండి.గౌస్, అజామ్, సతీష్, సింధు, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.