Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకున్న జాహ్నవి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ కార్యదర్శి వనగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు కలిసి క్లాసులు సరిగా జరగకుండానే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. విద్యార్థులకు సరిగా చదువులు చెప్పకుండానే పరీక్షలు నిర్వహిస్తారని ముందుగానే ప్రశ్నిస్తే మాన్యువల్ ఒక పరీక్ష కచ్చితంగా అవసరం అని అందరూ విద్యార్థులు పాస్ అయ్యే విధంగా చూస్తామని వారు ప్రకటనలు ఇచ్చి పరీక్షలు నిర్వహించారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీివైఎఫ్ఐ నాయకులు అవి శెట్టి కిరణ్ ,గోలి సాయి కిరణ్, యనమల ప్రవీణ్, జోగు నాగరాజు, సంజీవ, విగేష్, వెంకట్, మనీ రజిని, సుల్తానా, మానస, శాంతి, దివ్య, శిరీష ,రితిక, రమ్య తదితరులు పాల్గొన్నారు.