Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్‌క్లబ్ అధ్యక్షులు కుంచకూరి లక్ష్మణ్
నవతెలంగాణ-దేవరకొండ
విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నతంగా రాణించాలని దేవరకొండ లయన్స్‌క్లబ్ అధ్యక్షులు కుంచకూరి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు మాస్కులు, నోట్ బుక్స్, శానిటేషన్, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు విద్యాబోధన విద్యార్థులకు అందిస్తూ వారి ఉద్యోగుల భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ కోశాధికారి శివకష్ణ, లయన్స్‌క్లబ్ సభ్యులు డాక్టర్ పిజె.శ్యామ్సన్, గాజులరాజేష్, చీదెళ్ళ వెంకటేశ్వర్లు, తిరందాసు కష్ణయ్య, పగిడిమర్రి శ్రీనివాసులు, నారాయణరెడ్డి, రాధాకష్ణ, నీలా బుచ్చయ్య, గూడెల్లి రమేష్, ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్‌రావు, ఉపాధ్యాయులు నిర్మలాల్, పాలెస్, విద్యా కమిటీ చైర్మెన్ వెంకటయ్య పాల్గొన్నారు