Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఇంటర్లో ఫెయిలైన్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ నుండి డీఐఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహి ంచారు.అనంతరం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పోలెబోయిన కిరణ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్ బోర్డు బాధ్యతారాహిత్యానికి బలవుతున్న పాఠశాల, కళాశాలల విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరారు.నల్లగొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని జాహ్నవి ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ ఆత్మహత్యకు ముమ్మాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.మృతురాలి కుటుంబసభ్యులకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మందడి శ్రీధర్, తలారి ప్రదీప్, జలగంసుమంత్, మహేశ్వేరి, లోకేశ్వరి, సంధ్య, సుష్మ, నవ్య, సునీత, శతి, శైలిజ, రూప, శిరీష్, నాగేశ్వేరి, మనోహర్ పాల్గొన్నారు.