Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఓ వైపు విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన వత్తిధర్మాన్ని నిర్వరిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్.బలహీన వర్గాల ఆశాదీపంగా మారారు.నిరుపేద కుటుంబాలకు తన వంతుగా సహాయసహకారాలు అందిస్తున్నారు... తాజాగా, నిరుపేద పద్మశాలి చేనేత కుటుంబానికి చెందిన యువతి వివాహానికి రూ.5వేలు చేయూత అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే...పెండెం భవాని అనే యువతి వివాహం అశోక్‌తో ఈనెల 22న నకిరేకర్ పట్టణంలో జరుగనుంది. పుట్టు మూగ ఆయిన భవాని కుటుంబీకులు కడు పేదరికంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆమె తల్లి పార్వతమ్మ చేనేత కార్మికురాలు. భవాని అన్నయ్య ఇద్దరూ వికలాంగులు. భవాని కుటుంబం ఆమె వివాహ నిమిత్తం ఖర్చుల కోసం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని తన వంతుగా రూ.5వేలు ఆర్ధిక సాయం అందజేశారు. భవాని తమ్ముడు వత్తిరీత్యా డ్రైవర్. అతనికి బీసీ కార్పొరేషన్ ద్వారా డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా ప్రభుత్వం కారు మంజూరు చేసినట్టయితే వారి కుటుంబంలో వెలుగులు నింపేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.