Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
పలుకేసులతో సంబంధం ఉన్న నిందితున్ని పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా మండలకేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం అరెస్టు చేశారు.డీఎస్పీ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన బడేమియా అలియాస్ రఫిక్ 11 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఈ క్రమంలో బడేమియా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తల్లి మీరాబీ చెల్లెలు ఖాశీంబీతో పాటు అతన్ని తీసుకుని తన పుట్టింటికి భద్రాచలం తీసుకెళ్లింది.అక్కడి నుండి బతుకుదెరువు కోసం చెన్నై వెళ్లి మేస్రీ పనిచేశాడు.అతను చిన్న వయస్సులోనే చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడ్డాడు.ఇతను చౌటపల్లి దగ్గరలో మూతపడ్డ కామాక్షి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇనుము దొంగతనం చేశాడు.దానిని మట్టంపల్లిలోని పాత ఇనుపసామను దుకాణంలో అమ్ముకునే వాడు.2018లో బడే మియా తల్లి చెన్నైలో ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.అక్కడ ఆనంద్ బడేమియాను సరిగ్గా పట్టించుకోకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అత్తిపటపుదినార్లో రఫీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.అతనితో కలిసి సెల్ఫోన్లు దొంగతనం చేశాడు.పున్నేరు సబ్‌జైలులో 3 నెలల పాటు జైలు జీవితం అను భవించాడు.2019లో సెల్‌ఫోన్‌ను అపహరించి మెంజూర్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్టు అయ్యి మళ్లీ పుల్లర్ జైలులో 9 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు.తర్వాత తల్లి, చెల్లెలు బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారు.2019లో చెన్నై పోవడానికి ముందు మట్టపల్లి గుడి ముందు కృష్నానదిలో స్నానాలు చేసే మెట్ల దగ్గర వృద్ధురాలి డబ్బులు ఉండడాన్ని చూసి డబ్బులను లాక్కూని ఆమెను నీటిలోకి తోసి వెళ్లాడు.ఆ డబ్బులతో మద్యం సేవించి అక్కడి నుండి భద్రాచలం, చెన్నైకు వెళ్లాడు.చెన్నైలో జైలు జీవితం అనంతరం నెల్లూరు జిల్లా తడకు వెళ్లి అక్కడ నుండి చౌటపల్లి వద్ద నివాసమున్నాడు.డబ్బులు లేకపోవడంతో మెళ్లచెర్వు వెళ్లి అక్కడ షైన్ బైక్‌ను అపహరించి భద్రాచలంకు వెళ్లి బైక్‌ను వదిలేసి తన మేనమామ ఇంటికి వెళ్లాడు. రెండు నెలల తర్వాత కోదాడ వచ్చి మెళ్లచెర్వు ఫ్లైఓవర్ కింద పడుకొని మధ్య రాత్రి మెళుకువ రాగా రోడ్డుపై నడుస్తుండగా రాత్రి చీకట్లో వ్యక్తి రోడ్డు ప్రక్కన బైక్ ఆపి మూత్రం పోయుచుండగా బైక్ ముందు టాంక్ కవర్లో లావుగా కనిపి ంచడంతో డబ్బులు ఉన్నాయేమో అని భావించి అతడిని కర్రతో తలపైన కొట్టి బైక్ దొంగిలించుకొని సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత పెట్రోలు అయిపోగా దాని టాంక్కవర్లో వెతకగా కొన్ని కాగితాలు ఒక టచ్‌ఫోన్ దొరికిందని, దీనితో బైక్ ను అక్కడే వదిలిలేసి ఫోన్‌ను కొద్దిదూరంలో చెన్నై లారీ డ్రైవరుకు రూ.1200అమ్మాడు.వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు.ఆ తర్వాత మూడు నెలలకు నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి దగ్గర సుబ్బారావు అనే మేస్త్రి దగ్గర గతంలో 2016, 2017లలో పనిచేసిన పరిచయంతో మళ్లీ ఆదే చోటికి సుబ్బారావు వద్దకు మాల్ అందించే పని చేయడానికి వెళ్ళి రోజుకు రూ.700 చొప్పున పనిచేస్తూ 45 రోజులు వుండి ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అతనితో గోడవపడి లెక్క చూసుకోగా రూ.1800 రూపాయలు వస్తే తాగి ఖర్చు పెట్డాఉ.అక్కడ ఒక బైక్ దొంగ తనం చేసి బైక్ తీసుకొని దానిపై కామారెడ్డి దాటి హైదరాబాద్ వెళ్ళుచుండగా ఒక ఆడమనిషి నడుచుకుంటు వెళ్ళు చుండగా బైక్‌ను కొద్ది దూరంలో పార్క్ చేసి ఆమె వద్దకు వెళ్లి ఆమె వద్ద డబ్బులు గుంజుకొని రోడ్ ప్రక్కన చెట్లలోనికి తీసుకెళ్లి ఆమె మెడలో వున్న బంగారు గొలుసు, చెవి కమ్మలు గుంజుకొని కొడవలితో తలపై కొట్టి గాయపరిచాడు.తర్వాత కామారెడ్డికి వెళ్ళి రెండు రోజుల తర్వాత కామారెడ్డిఆర్టీసీ బస్టాప్ వద్ద మహిళ నడుచుకుంటూ వెళ్ళుచుండగా ఆమెను చేతులతో కొట్టి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లి రూ.5 వేలకు అమ్ము కున్నాడు.అనంతరం దొంగిలించిన బైక్‌ను హైదరాబాద్ దగ్గరలో ఒక పెట్రోల్ బంకు వద్ద వదిలేసి కొద్ది రోజులు హయత్‌నగర్‌లో మేస్త్రి వద్ద పని చేసి డబ్బులు సంపాదించి జల్సా చేశాడు.ఆ తర్వాత కోదాడ వచ్చి అక్కడ హుజూర్నగర్ రోడ్డులో అగ్రికల్చర్ మార్కెట్ ముందు ఒక బైక్ వుండగా దానిని దొంగిలించి కొద్ది దూరం వెళ్ళి డిక్కీలో చూడగా దానిలో పురుగుల మందు డబ్బాలు వుండగా వాటిని అక్కడ రోడ్డు వెంట వెళ్తున్న వ్యక్తికి రూ.2 వేలకు అమ్ముకున్నాడు.ఆ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో కోదాడలోని హైదరాబాద్ రోడ్డులో ఒక పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ వదిలేశాడు.హయత్‌నగర్ బస్టాప్ సమీపంలోని వైన్స్ దుకాణం ఉన్న మహిళ పడుకుని ఉండడాన్ని గమనిం చాడు.ఆమె వద్ద ఉన్న డబ్బులను కాజేయాలనే ఉద్దేశంతో మద్యం సేవించుదామని నమ్మించి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కిందపడేసి రాయితో ముఖంపై మోదాడు.ఆమె చనిపోయిన తర్వాత రూ.500 తీసుకుని శవాన్ని నీటిలోకి నెట్టివేసి పరారయ్యాడు. అనంతరం నల్లగొండ బస్టాండ్ దగ్గరలో పోలీస్‌స్టేషన్ ముందు పార్కింగ్ చేసి ఉన్న బాక్సర్ బైక్‌ను అపహరించి ఇబ్రహీంపట్నం వెళ్లాడు.అక్కడ వృద్ధురాలి మెడలో ఉన్న బంగారాన్ని లాక్కుని రూ.3వేలకు అమ్ముకుని జల్సాలు చేశాడు.ఈ నెలలో ఆదివారం చింతపల్లిలోని సాయిబాబాగుడి వద్దకు వచ్చాడు.అక్కడ ఓ వృద్ధుని వద్ద డబ్బులు ఉండడాన్ని గమనించాడు.అతనితో పరిచయం పెంచుకుని అదేరోజు సాయంత్రం క్వార్టర్ మద్యం కొనుగోలు చేశాడు.ఇద్దరం కలిసి తాగుదామని వృద్ధున్ని నమ్మించినా నమ్మకపోవడంతో అక్కడే బండరాయితో ముఖంపై కొట్టి వెళ్లాడు.తర్వాత అతన్ని హత్య చేశాడు.విచారణలో నేరాలను అంగీకరి ంచాడు.నిందితున్ని అరెస్టు చేసిన సీఐ సత్యం, ఎస్సై వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ ఎస్సై రాంబాబు, లింగయ్య, కానిస్టేబుల్ తిరుమలేష్, రాములు, నాగరాజు, రవిలను డీఎస్పీ అభినందించారు.