Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన శుక్రవారం మండలంలోని పినవూర గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పినవూర గ్రామానికి చెందిన తేర భగవంతరెడ్డికి 13 ఎకరాల భూమి ఉంది.తన వ్యవసాయపొలంలో కూలీలతో పనులు చేయిస్తున్నాడు.పినవూరకు చెందిన తేర వెంకట్రెడ్డికి తేర భగవంతరెడ్డి (68)కి వీరిద్దరికీ భూములవిషయంలో పాతగొడవలు ఉన్నాయి.తేర భగవంతరెడ్డి, నారాయణరెడ్డి, లచ్చిరెడ్డి ముగ్గురు అన్నదమ్ముళ్లు.భూమి పంపకాల విషయంలో అనేకసార్లు గోడవలు జరిగాయి.దాంతో కొంతకాలంగా హాలియా నుంచి భగవంతరెడ్డి రోజు పినవూరకు వచ్చి పొలం పనులు చూసుకొని వెళ్ళేవాడు .ఈ క్రమంలో పాతకక్షలను దష్టిలో పెట్టుకొని శుక్రవారం మధ్యాహ్నం మతుని అన్న కొడుకు తేర వెంకట్రెడ్డి భగవంతరెడ్డి వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్న క్రమంలో పినవూర పెద్దవూర రహదారిలో కాపుకాచి మలుపు వద్ద కళ్ళలో కారంచల్లి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు.దీంతో భగవంతరెడ్డి కన్నుపై,చెవిపై రక్తగాయాలయ్యాయి. భగవంతరెడ్డికి వివాహం కాలేదు.ఇతన్ని చంపితే భూమిఅంతా వారికి చెందుతుందని పథకం.ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది.రక్తపు మడుగులో కొట్టుకుంటున్న భగవంతరెడ్డిని వెంటనే పోలీసులు సాగర్ కమలానెహ్రు ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.మతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం కమలానెహ్రు ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.