Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యపేట కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ నుండి మున్సిపల్ కార్మికులు గంటసేపు గేటు ముందు ధర్నా నిర్వహించారు.అదనపు కలెక్టర్ మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి మధ్యాహ్నం తిరిగి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారన్నారు.మున్సిపల్ కార్మికులకు ప్రతినెలా రూ.21 వేల వేతనమివ్వాలని కోరారు.కార్మికులకు కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలని, పండుగ సెలవులు ఇవ్వాలని, చెత్త వేరిచేసే పనిని ఎత్తివేయాలని, రెండు జతల బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంత వరకు మున్సిపల్ కార్మికులు దశల వారీగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చాగంటి వెంకటరమణ, మామిడి సుందరయ్య, ఓగోటి దశరథ,దుర్గారావు, మురళి,సాయి, రేవతి,చంటి, భిక్షంనాయక్, లింగయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.శేఖర్,కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి, నాయకులు ముదిగొండఎల్లమ్మ, రాధాకష్ణ పాల్గొన్నారు.