Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మోతె
ఈనెల 21,22వ తేదీల్లో పట్టణంలో జరిగే సీపీఐ(ఎం) ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో పార్టీ మండల కమిటీ సమావేశం మండల కమిటీ సభ్యులు బత్తిని వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకపోరాటాల పురిటిగడ్డ అయినా హుజూర్నగర్లో పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ సభకు జిల్లావ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు.21వ తేదీన వేలాది మంది రెడ్షెర్ట్ వాలంటీర్లతో పట్టణంలో భారీ కవాత్ నిర్వహిస్తామని చెప్పారు.ఈ మహాసభలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి ప్రజాఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం,రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.దళిత గిరి జనులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. భూ సంబంధ సమస్యలను నేటికి అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. యాసంగి వరిపంట విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని విమర్శించారు.బీజేపీ ప్రభు త్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా యాసంగి వరిపంటను కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.రవినాయక్ , కొలిశెట్టియాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, మండల కార్యదర్శి ఎం.గోపా ల్రెడ్డి, మండలకమిటీ సభ్యులు కె. సత్య నారాయణ,జి.ఏసు, చర్లపల్లి మల్లయ్య, సోమగాని మల్లయ్య,ఎనుమల్లయ్య, కొండరాములు, కె.అలివేల ,జి.కృష్ణ, బి.లచ్చీరామ్, ఎస్కె.జాన్బీ పాల్గొన్నారు.