Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
108 అంబులెన్స్‌లోనే గర్భిణీకి ప్రసవం చేయడం జరిగిందని 108 సిబ్బంది ఈఎంటీ ఇమాన్పాషా అన్నారు.శుక్రవారం ఈఎంటీ ఇమాన్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన మాతంగి అనూష భర్త వెంకటేశ్వర్లు అనే మహిళకు శుక్రవారం తెల్లవారుజాము నుండి పురిటినొప్పులు రావడంతో 108కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న 108 లో కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108లోనే ప్రసవం చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులు గ్రామంలోనే పెద్దలు అందరూ ఎంతో అభినందించినట్టు తెలిపారు.