Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీపరిధిలోని హిల్‌కాలనీలోని గౌతం బాలవిహార్ మందు పార్టీకి అడ్డాగా మారింది.శుక్రవారం తెలంగాణ లిక్కర్ ఆంధ్రా ప్రాంత వ్యాపారులకు కిక్కు గా మారింది.వివరాల్లోకి వెళితే.. శ్రీస్టార్ బయో రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కొంతమంది వర్తకులు గౌతం బాలవిహార్‌ను అడ్డగా చేసుకొని మందు పార్టీని ఏర్పాటు చేసుకొవడం జరిగింది.గతంలో కంటే భిన్నంగా ఎన్నడూ లేనివిధంగా మందు పార్టీ కోసం బాలవిహార్‌ను కేటాయించడం ఏంటని స్థానికులు ఆరోపిస్తున్నారు. హిల్‌కాలనీ నడిబొడ్డులో ఉన్న బాలవిహార్‌ను తాగుబోతులకు అడ్డాగా మార్చాల్సిన అవసరం ఏముందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఆంధ్రాప్రాంతం నుండి దాదాపు 65 మంది బయోరెమెడీస్ వ్యాపారులు హాజరయ్యారు.ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.