Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
విశ్రాంతఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం 40వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో సంఘ యూనిట్ అధ్యక్షులు అక్కిరాజు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని నాకారా విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి సేవలందించి వారికి పెన్షన్ లేకపోవడం సరికాదని భావించి తన కర్తవ్యంగా బాధ్యతగా న్యాయస్థానంకు వెళ్లి పెన్షన్ తీసుకొచ్చేందుకు నకారా చేసిన కషి చిరస్మరణీయమన్నారు.కాగా ఎమ్మెల్యే బొల్లం దష్టికి పెన్షనర్లు పలు సమస్యలను తీసుకెళ్లారు.ప్రధానంగా ఉద్యమసమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వఉద్యోగులతో పాటు విశ్రాంతఉద్యోగులకు కూడా ఇన్సెంటివ్ ఇస్తానన్నారు.అది అమలు కావడం లేదని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డు సరిగా అమలు కావడం లేదని అసెంబ్లీలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులు సమస్యలను తన దష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కషి చేస్తానని అన్నారు. యూనిట్ బలోపేతంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా ఉండడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా విగ్రహ దాత వేనేపల్లి శ్రీనివాసరావును అభినందించారు.అనంతరం సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ అధ్యక్షులు అక్కిరాజు వెంకట్రావు, ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి, జిల్లా అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కార్యదర్శి బొడ్డు వీరయ్య, విగ్రహ దాత వేనేపల్లి శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు హనుమారెడ్డి, కోశాధికారి అమతా రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు జాన్ షరీఫ్, లక్ష్మీ నరసయ్య, భిక్షం, టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజా రమణి పాల్గొన్నారు.