Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజులుగా విద్యుత్ పవర్ సప్లై నిలిపి వేశారు. దీంతో రోజు జరిగే ధరణి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. స్లాట్ బుకింగ్ బుకింగ్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి పోతున్నారు. ప్రతినెలా 8000 రూపాయల ముందస్తుగా ప్రిపైడ్ కరెంట్ సరఫరా తో కార్యాలయంలో విద్యుత్ నడుస్తుంది. ఈనెల గవ్నమెంట్ నుంచి ఫండ్ రాలేదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ నిలిపివేయడంతో కార్యాలయంలో ఫ్యాన్లు తిరగాక, లైట్లు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ నిలిపి వేయడంతో కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, మండల ప్రజలు ఇతర సర్టిఫికెట్ల కోసం కంప్యూటర్ ప్రింటర్ రాక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
రెండు రోజులుగా విద్యుత్ కట్అయినది వాస్తవమే : తహసీల్దార్ మహేందర్ రెడ్డి
రెండు రోజులుగా విద్యుత్ కట్ అయినది మాట వాస్తవమే. ధరణి రిజిస్ట్రేషన్లు ఆగిన వి, జిల్లా కలెక్టర్కు విద్యుత్ సమస్యపై లెటర్ పెట్టాం. బడ్జెట్ రాగానే ధరణి రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి.