Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు దూదిమెట్ల బాలరాజు గొర్రెల మేకల అభివద్ధి కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమితులయ్యారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మండలంలోని పాలెం గ్రామంలో దూదిమెట్ల అమత, బిక్షమయ్య దంపతులకు జన్మించిన బాలరాజు అంచెలంచెలుగా ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీలో పీహెచ్డీి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ జువాలజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులో బీ ఈడీ చేశారు. బాలరాజు 1999లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పని చేశారు. 2006లో ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ లో చేరినప్పటి నుండి తెలంగాణ వాదిగా మలిదశ ఉద్యమంలో వివిధ స్థాయిలలో పని చేశారు. మలిదశ ఉద్యమం నుండి నేటి వరకు టీిఆర్‌ఎస్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఆయనకు ఎలాంటి అవకాశం రాకపోయినా పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల తో పాటు ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం కనబర్చారు. బాలరాజు ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఆయన్ను గొర్రెల, మేకల అభివద్ధి కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమించారు.