Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.25 వేల ఆర్థికసాయం అందజేత
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
కాంగ్రెస్ మండల ప్రచార కార్యదర్శి చిరుమర్తి కిషన్ పార్థివదేహాన్ని మండలపరిధిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ,మండలఅధ్యక్షుడు బత్తుల ఉషయ్యగౌడ్,ఎంపీటీసీ పాశం శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. దహన సంస్కారాలకు రూ.25 వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ పబ్బతీ వెంకట్‌రెడ్డి,మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి,మాజీ సర్పంచ్ ధర్మయ్య, తొండ్లాయిఎంపీటీసీ చింతదేవమ్మ, మాజీ ఎంపీటీసీ కుశలరెడ్డి,లింగాలరాములు, నార్కెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు ప్రజ్ఞపురం సత్యనారాయణ, సమ్మద్ అహ్మద్,అఖిల్, యూసుఫ్, సతీష్, దేవిక, సైదులు, ప్రసాద్, ఉపేందర్, రాజు,వెంకన్న పాల్గొన్నారు.
అదేవిధంగా గుండెపోటుతో మర ణించిన యువజన కాంగ్రెస్ నాయకుడు చిరుమర్తి కిషన్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే వేములవీరేశం మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లంల గ్రామంలో సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.రూ.10 వేల ఆర్థికసహాయం చేశారు.ఈ కార్యక్రమంలో నార్కట్‌పల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, నాయకులు గడ్డంపశుపతి, కొరివి శివరాం, బోడశంకర్, సోమనబోయిన సురేష్, నరేష్, నాగరాజు పాల్గొన్నారు.