Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పట్టణ కేంద్రంలో నవజీవన్ బ్లడ్సెంటర్ను జిట్ట మహేష్ అక్కనపెళ్లి సతీష్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణధాతలు కావాలని పేర్కొన్నారు.రక్తదానం ఒక ప్రాణదానమన్నారు.ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కూరెల్ల లింగస్వామి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ మెండేసైదులు,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పొన్నంలక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్,గ్రంథాలయ చైర్మెన్ దాసరినర్సింహ,యూత్ అధ్యక్షులు చిత్రగంటి ప్రవీణ్,గంటా శ్రీనివాస్‌రెడ్డి,మేడిఉపేందర్, ఆవుల ఆనంద్, బ్లడ్‌డోనర్స్ పాల్గొన్నారు.