Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాకేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య శుక్రవారం రాత్రి గుండెపోటుతో మతి చెందారు.ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఆయన తండ్రి రామ చంద్రారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మెన్,ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల జెడ్పీ చైర్మెన్లు బండా నరేందర్‌రెడ్డి, వెలిమినేటి సందీప్‌రెడ్డి,ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ప్రెస్‌అకాడమీ చైర్మెన్ అల్లంనారాయణ, నల్లగొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోములభగత్,చిరుమర్తి లింగయ్య, మునుగోడు, నకిరేకల్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,వేములవీరేశం,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శశిధర్‌రెడ్డి, మాలే శరణ్యారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున గాదరి మారయ్య పార్థివదేహనికి నివాళులర్పించారు.గాదరి కిషోర్‌కుమార్ కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు.అంత్యక్రియల్లో పాల్గొన్నారు.