Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ముగ్గురు ప్రముఖ సంస్థ అస్యూర్ ఎడ్జ్ టెక్నాలజీస్ లిమిటెడ్లో శనివారం జరిగిన కాంపస్ సెలక్షన్స్లో ఎంపిక య్యారని ఆ కళాశాల చైర్మెన్నీలా సత్య నారాయణ తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను కళాశాల అధ్యాపకబందం అభిన ందించారు. వీరికి వార్షిక వేతనం రూ.2 లక్షలు వుంటుందని ఆ సంస్థ ప్రతినిధి శివప్రసాద్ తెలిపారు.అనంతరం విద్యార్థినులకు నియామకపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డా.అబ్దుల్ సలీం ,ప్రిన్సిపాల్ నాగార్జునరావు మాట్లాడుతూ తమ కళాశాలలో జరిగే క్యాంపస్ సెలెక్షన్స్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తమ కళాశాల విద్యార్థినులు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికకావడం గర్వకారణమన్నారు.