Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని విజయవంతం చేయాలి
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభివద్ధి ఓర్వలేక రైతులను మోసం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడడం దారుణమని టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి , రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, ఎంపీపీ కర్నాటిస్వామియాదవ్ అన్నారు.శనివారం మండ లకేంద్రంలోని సత్యఫంక్షన్హాల్లో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండేందుకు కేంద్రంపై కొట్లాడేందుకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తా సైనికుల్లా పని చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ నాయకులు రైతుబంధు పథకం,టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు .ఈనెల 20న మండలకేంద్రంలో నిర్వహించే నిరసన, కేంద్ర్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్తా, సర్పంచులు,ఎంపీటీసీలు, రైతుసమన్వయ సమితి గ్రామ, మండల అధ్యక్షులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ అనంత వీణస్వామి గౌడ్,ఎంపీటీసీలు చెరుకుకష్ణయ్య, ఈద నిర్మలశరత్బాబు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండిరఫీక్, టీఆర్ఎస్ యూత్ విభాగం మండలఅధ్యక్షుడు మాదగోని రిషిగౌడ్, చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాసులు, సోషల్‌మీడియా మండల కన్వీనర్ బండారివెంకన్న, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండలఅధ్యక్షుడు శంకర్,టీిఆర్‌ఎస్ నాయకులు పందుల నర్సింహ, నేరటి మల్లేష్ పాల్గొన్నారు.