Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సాగునీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పడిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ...రైతాంగం కోసం కెసిఆర్ 7 సంవత్సరాలలో భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత కరెంటు, నీళ్ళు ,రైతు బంధు, రైతు భీమ వంటి పధకాలను తీసు కొచ్చార న్నారు.ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కేంద్రం వైఖర్ని నిలదీస్తూ. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20న బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు.ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తయడంతో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈ చంద్రశేఖర్ ఏఈ ఉదరు కుమార్,స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్నయాదవ్, టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు వంటల చేతన్‌కుమార్,టీఆర్ఎస్ మండలఉపాధ్యక్షులు బొజ్జఅరవింద్ పాల్గొన్నారు.