Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
అడ్లూరు, రెబల్లె, చింతిర్యాల ఎత్తిపోతల పథకాలను ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభివద్ధికి అహర్నిశలు కషి చేయడం చాలా హర్షణీయమన్నారు. ఉత్తం కుమార్‌రెడ్డి హయాంలో లిఫ్ట్ శంకుస్థాపన జరిగిన ఆధునీకరణకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంలోని జరుగుతుందని, నియోజకవర్గ అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం వడ్లు కొనమంటే వితండవాదం చేస్తుందన్నారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలోని అడ్లూరు, రేబల్లె, చింతిర్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు గత కాంగ్రెస్ ప్రభుతంలో నిర్మించిన ఈపధకాలు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో ముంపుకు గురికావడంతో అవే పథకాలను పునర్నిర్మాణం చేశారన్నారు.ఈ పనులు ఇటీవలే పూర్తయ్యా యన్నారు.అనంతరం మహిళా పత్తి కార్మికులతో మాట్లాడారు.ఎమ్మెల్యేశానంపుడి సైదిరెడ్డి మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే మాట నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, నేను కష్టపటే బిడ్డనే అని రైతుల కష్టాలు అని నాకు తెలుసిన వాడినన్నారు.ప్రతి ఎకరాకు నీరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాల న్నారు.హుజూర్నగర్ నియోజక వర్గవ్యాప్తంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ 99 శాతం అమలుచేస్తానని అన్నారు.అభివద్ధిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సహకరించాలని, అందరం కలిసి హుజూర్నగర్ నియోజకవర్గ అభివద్ధికి కషి చేయాలని, కేంద్రం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతుందని, పంట మార్పిడి పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీలో అభివద్ధి పనులపై స్టే తెప్పించిన కాంగ్రెస్ నాయకులను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడి స్టే ఎత్తివేసేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీిఎస్పీ రఘు, ఐడీసీ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎంపీపీ, జెడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.