Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో మండలపరిధిలోని అనంతారం గ్రామంలో పోలీస్ కళాబందం వారు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు ఓటీపీ ఫ్రాడ్స్, రోడ్డు ప్రమాదాలు- నివారణ, షీ టీమ్స్, మహిళల భద్రత రక్షణ, 100 డైల్, సోషల్‌మీడియా, సైబర్‌నేరాలు, సెల్‌ఫోన్ వల్ల కలిగే అనర్థాలు,మొదలగు అంశాలపై ఆటాపాటల ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, , ఎంపీటీసీ మామిడి రేవతిపరంధాములు, ఏఎస్ఐసుధాకర్రెడ్డి, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, పోలీస్ కళాబందం సిబ్బంది పాల్గొన్నారు.