Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
క్షణికావేశం అనేక అనర్థాలకు దారితీస్తుందని సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్‌ఎన్.మూర్తి అన్నారు. శనివారం స్థానిక సబ్‌జైలును ఆయన సందర్శించి అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆవేశాలకు లోనట్టయితే నష్టం వాటిల్లుతుందన్నారు.విలువైన జీవితం నష్టపోవాల్సి వస్తుం దన్నారు.న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు న్యాయ సేవాఅధికార సంస్థ ద్వారా న్యాయ వాదులను ఏర్పాటు చేస్తామన్నారు.అనంతరం సబ్‌జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకొని అడిగి సంతప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జి సంకేతమిత్ర,కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్‌సుందర్,సబ్‌జైలు సూపరింటెండెంట్ మంగ్తా, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు,ఎంఎస్.రాఘవరావు,కొట్టు సురేష్ ,సిబ్బంది శ్యామ్‌కుమార్, జానయ్య పాల్గొన్నారు.