Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
రాజకీయ దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి రైతు వ్యతిరేక విధానాలపై గ్రామాలలో ప్రజల దష్టికి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఫ్లోరోసిస్ విముక్తి అప్పటికీ కేంద్రం సహకారమందించడం లేదన్నారు. రూ.650 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకం పనులు 70 శాతం పూర్తయ్యాయని, వచ్చే రెండు సంవత్సరాలలో పనులు పూర్తి చేసి రూ.3 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గంలో లక్షా 16 వేల ఎకరాల భూమికి సాగునీరందిస్తున్నామన్నారు.నాగార్జునసాగర్ ముంపు ప్రాంతాలవారికి నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ఐదు లిఫ్టులను మంజూరు చేసి టెండర్లు పూర్తి చేశామన్నారు.వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి వరి ధాన్యం బాగా పండిందన్నారు. దీంతో కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకుండా రాష్ట్రంపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెలంగాణలో 60 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం ఒప్పందం చేసుకున్నారని, మరో 25 లక్షల టన్నుల వరి కొనవలసిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.యాసంగిలో పంట కొనుగోలు చేసేంత వరకూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు మాధవరం సునీత జనార్దన్‌రావు, ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ,జెడ్పీటీసీలు అరుణ సురేష్‌గౌడ్, కంకణాల ప్రవీణ, రమావత్ పవిత్ర, టీబీఎన్.రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నియోజక వర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
దాసరి నెమలి పూర్ రోడ్డుకు రూ.2.80 కోట్లు మంజూరు
డిండి మండలం దాసరినెమలిపూర్ రోడ్డుకు రూ.2.80 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.సీిఆర్ఆర్ కింద నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు వేసి రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.గత ఎన్నికలలో హామీ మేరకు నిధులు మంజూరుచేశామన్నారు.