Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి
మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
వైద్యో నారాయణో హరి అన్న చందంగా సమాజంలో సేవల ద్వారా వైద్యులకు ఎంతో గౌరవం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శనివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రివర్నిమ్స్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రపంచంలోని అన్నిరంగాల్లో ప్రైవేట్ సెక్టార్ చాలా విస్తరించిందన్నారు.అదేతరహాలో వైద్యరంగంకూడా విస్తరిస్తూ వస్తోందన్నారు. డబ్బులు ఎంత సంపాదించినా సరిపోదని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే ఉత్తమమని సూచించారు.మంచిపేరు రావాలంటే నిస్వార్ధమైన సేవలను కూడా అందించాల్సిన అవసరం ఉంటుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తుందన్నారు.ప్రతి ఒక్కరికి మెరుగైన నాణ్యమైన సేవలను అందించేందుకు కషి చేస్తుందన్నారు.ఇంకా మెరుగైన వైద్యానికి గ్రామీణ పేద ప్రజలు హైదరాబాద్ పైనే ఆధారపడి ఉన్నారని, ఇలాంటి సమయాల్లో పట్టణ ప్రాంతాలలో ఇంకా మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రులను ప్రారం భించడం సంతోషకరమన్నారు. గ్రామీణప్రాంతాల్లో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వైద్యులు కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు.ప్రయివేట్ ఆస్పత్రులు అనగానే అమ్మో అనుకునే ఆలోచనలు ఉన్నాయ న్నారు.జనాలకు వైద్యం మీద సదాభిప్రాయం కలిగించే విధంగా ప్రయివేట్ వైద్యసేవలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో కొందరి కారణంగా వైద్యరంగంపై కొన్ని విమర్శలు ఉన్న విషయం వాస్తవమేనన్నారు.కానీ మంచి సేవలు చేసే వైద్యుల వల్ల ఈ వత్తికి ఆ గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.మెరుగైన వసతులతో ఆస్పత్రులు పెట్టడం ఈరోజుల్లో ఓ సాహసమని అదేవిధంగా ప్రజలు మెచ్చే విధంగా కూడా ఆసుపత్రుల్లో సేవలు అందించాలని సూచించారు.ఏ ఆశయం చేత ఆస్పత్రులు నెలకొల్పబడ్డాయో దానికి అనుగుణంగా ప్రజా సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజ కవర్గాల శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్,శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వివిధ ప్రజాప్రతినిధులు, హాస్పిటల్ నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.