Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలవిహార్‌కు తాళం వేసిన అధికారులు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
హిల్‌కాలనీలోని బాలవిహార్‌లో శుక్రవారం ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్స్ నిబంధనలకు విరుద్ధంగా మందు సేవించడంపై కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.'మందు పార్టీకి అడ్డాగా బాలవిహార్'అనే శీర్షికన వార్తాకథనం నవతెలంగాణలో ప్రచు రితమైంది.స్పందించిన కలెక్టర్ శనివారం పెద్దవూర మండల అధికారులతో మాట్లా డారు.ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న బాలవిహార్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని పెద్దవూర తహసీల్దార్‌ను ఆదేశించారు. తహసీల్దార్ సాగర్‌లోని బాలవిహార్‌కు అధికారులను పంపించిన అనంతరం స్థానిక కౌన్సిలర్ రమేష్‌జీ, నాయకులు మోహన్‌నాయక్,ఆదాసు విక్రమ్ సమక్షంలో పంచనామా నిర్వహించి బాలవిహార్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని తాళం వేశారు.బాలవిహార్‌లో ఇకపై ప్రయివేట్ కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అధికారులు తెలిపారు.
ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు
కౌన్సిలర్-శిరీషామోహన్నాయక్
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ 3వవార్డులో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని కౌన్సిలర్ శిరీష మోహన్‌నాయక్ అన్నారు.బాలవిహార్‌ను ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఇలాంటి సంఘటనలే పునరావతమవుతాయన్నారు.అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలలోగాని,పబ్లిక్ప్లేస్లలోగాని మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందికలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.