Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్రాల హక్కులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి. జహంగీర్ అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు తడక మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అదాని, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తుం దన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే రాజద్రో హం కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు చీరిక సంజీవరెడ్డి, రాగీరు కిష్టయ్య, బొజ్జ బాలయ్య పాల్గొన్నారు.