Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రామన్నపేట
వీఆర్ఏలకు పీఆర్సీ వర్తింపజేసి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సేవలందిస్తున్న వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బోల్ల భాషయ్య, ఎడ్ల వెంకన్న, జినుకల శ్రీను, మండలాధ్యక్ష కార్యదర్శులు మాదాసు నర్సింహా, మండల ఉపాధ్యక్షులు, ఎమ్‌డి.బాబు, జానీ, జింక శంకరయ్య, రాములు, యాదమ్మరాములమ్మ, కూమార్, రాణి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.