Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిటౌన్
భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని వచ్చిన డిమాండ్ న్యాయ సమ్మతమైదని ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ విజరు భార్గవ్ అన్నారు. మొదటి వార్షికోత్సవం ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది కాలంగా జ్ఞానమాల నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం 53 వారాలుగా జ్ఞానమాల సమర్పించిన నాయకులను ఘణంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు బెంజమిన్, సాధన సమితి జిల్లా నాయకులు బెల్లి కష్ణ, తంగెళ్ళపల్లి రవి కుమార్, చిలుక మారి గణేష్ మాదిగ, భానోతు భాస్కర్ నాయక్, రావుల రాజు, బొడ్డు కష్ణ, ఇటుకల దేవేందర్, దుర్గాయి జహంగీర్, బండారు రవివర్దన్, మహ్మద్ సలావుద్దీన్, ముత్యాల జలేంధర్, తదితరులు పాల్గొన్నారు.