Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక చర్యలను ఖండిస్తూ చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ కోరారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపు మేరకు వరి దాన్యం కొనుగోలు చేయనని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉదయం నుండి తొమ్మిది గంటలకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కి తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టెస్కబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరవుతున్నారని చెప్పారు . ఈ కార్యక్రమంలో కో-ఆపరేటివ్ చైర్మెన్ మొగల్ గాని మల్లేశం , రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కోటగిరి పాండరి, టీఆర్ఎస్ నాయకులు సర్పంచులు వడ్ల నవ్య శోభన్ బాబు, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఏసీరెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు కోరుకోప్పుల కష్ణయ్య, కోటగిరి శ్రీధర్, కె.రాములు, కుడుముల రవి, మామిడాల నరసింహులు, మామిడాల భాను, బండ మహేందర్, దూడల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.