Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలను ఆదివారం స్థానిక మార్కండేయ దేవాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడి పదవికి కోడి గిరిబాబు, కోమటి వీరేశం, పులిపాటి ప్రసన్నలు ప్రధానంగా పోటీలో నిలిచారు. ఏకగ్రీవం కోసం చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని పోటీదారులకు అవకాశం కల్పించారు. చర్చలు సఫలం కాలేదు. దీంతో సమావేశంలో వాదోపవాదనలు జరిగాయి. ఎన్నిక ప్రక్రియ కాస్త రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. రహస్య ఓటింగ్ విధానం లో ఎన్నికలు జరగాలని వాదనలు కొందరు బలంగా వినిపిస్తున్నారు. అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది ఏ విధంగా ఎన్నిక జరుగుతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.