Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జనవరి 22నుడి 25 తేదీ వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని అనాజిపురం ఆ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాసభలును జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి కరపత్రంతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్ల కాలంలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని మునుపెన్నడూ లేనంతగా మత విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతిని నెలకొల్పిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మాజీ మండల కార్యదర్శి బొల్లపల్లి కుమార్, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, అబ్దుల్లాపురం వెంకటేష్,శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, పార్టీ సభ్యులు ఏదునూరి జమ్మయ్య,కడారి కష్ణ, కిషన్, పరమేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.