Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, టీఎస్యూ సంఘాల ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల బంద్ చేయనున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెట్టి విద్యార్థుల చావులకుకారణమైయిన ప్రభుత్వం నిర్ణయాన్నికి వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి తక్షణమే ఇంటర్ బోర్డు కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకష్ణ, టి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు మురళీ, ఎస్ఎఫ్ఐ నాయకుడు రావణ్ పాల్గొన్నారు.