Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బ్యాంకు అధికారులను నిలదీసిన గిరిజనులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
తాము సాగు చేసుకుంటున్న భూములను ఆన్‌లౌన్ తమ పేరు మీద మారిస్తే తప్ప బ్యాంకు రుణాలు చెల్లించేది లేదని రాచకొండ గిరిజనులు బ్యాంకు అధికారులను నిలదీశారు. రాచకొండ లోని కడ్డీల భాయి తండాకు చెందిన గిరిజనులు గత పదేండ్ల కిందట ప్రభుత్వం రాచకొండ లోని సర్వే నెంబరు 273 అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది. ఈ భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను నారాయణ పురం గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూములకు సంబంధించి రైతుల పేర్లను ఆన్లైన్ చేర్చక పోవడంతో రైతులు తిరిగి అప్పులు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించి నూతనంగా అప్పులు తీసుకుని అవకాశం లేకపోవడంతో గతంలో తీసుకున్న అప్పులను గిరిజనులు తిరిగి బ్యాంకు అధికారులకు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు వన్‌టైం సెటిల్మెంట్ కింద ఎంతో కొంత రాబట్టేందుకు ఆదివారం రాచకొండలోని తండాకు వచ్చారు. మీరు తీసుకున్న అప్పులను సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు. తమ భూములు తమ పేరుమీదనే లేనప్పుడు తిరిగి అప్పు ఎట్లా కట్టాలని బ్యాంకు అధికారులను గిరిజనులు నిలదీశారు. ఆన్లైన్ తమ పేర్ల మీద భూములను నమోదు చేస్తే ఒక్క రూపాయి కూడా లేకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. భూమిని ఆన్లైన్ చేసే అధికారం తమకు లేదని బ్యాంకు అధికారులు చెప్పిన గిరిజనులు వినిపించుకోకుండా ఆన్లైన్లో పట్టాలిస్తేనే అప్పులు చెల్లిస్తామని చేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
భూమి తమ పేరు మీద లేనప్పుడు అప్పట్లో ఉంటది
కాత్రోత సాగర్ మాజీ సర్పంచ్ రాచకొండ
ప్రభుత్వం ఇచ్చిన భూములు తమ పేర్ల మీద లేనప్పుడు ప్రభుత్వ అధీనంలోని వస్తున్నాం బ్యాంకులు ఇచ్చిన అప్పులు తమ పేర్ల మీద ఎట్లా కొనసాగిస్తారు. తమ పేర్ల మీద అ భూములు నమోదు చేసే వరకు ఇట్లాంటి అప్పులు కట్టేది లేదు. భూమి పట్టాలు రద్దు చేసిన ప్రభుత్వం అప్పులు ఎందుకు రద్దు చేయదు. తమ పేర్ల మీద భూములు నమోదయ్యాకనే అప్పులు చెల్లిస్తాం. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టం. అప్పటివరకు బ్యాంకు అధికారులు గిరిజనుల జోలికి రావొద్దు. సంబంధిత జిల్లా అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి.