Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కాంగ్రెస్ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని మాజీ శాసనసభ్యులు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ కెె.నగేశ్ , టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరా కాంగ్రెస్ భవనంలో పట్టణ అధ్యక్షులు ఎంఏ.ఎజాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆన్లైన్ డిజిటల్ సభ్యత్వ నమోదులో భాగంగా నియోజకవర్గం 303 బూతుల ఉన్నాయన్నారు . ప్రతి బూతు నుండి 150 ,200 సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. ఎవరైతే మూడు వందలు సభ్యత్వాలు చేస్తారో రూ.5వేల బహుమతిని ప్రధానోత్సవం చేస్తామన్నామని తెలిపారు . టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో సన్మానం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలేరు ఎంపీపీలు గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, ఆలేరు మండల కోఆప్షన్ సభ్యులు ఎండి. గౌస్ , మహిళా జిల్లా అధ్యక్షులు నీలం పద్మ, , కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరు ,రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట ,ఆత్మకూరు, మండల పార్టీ అధ్యక్షుడు కనురాజు వెంకటేశ్వరరాజు ,మహేందర్, శంకర్‌నాయక్ ,మల్లేష్ , బాలరాజు, లక్ష్మణరావు,నాయకులు పాము అనిత, మల్లెల శ్రీకాంత్, కర్రే అజరు, గాజుల వెంకటేష్,గాజుల దశరథ, జూకంటి సంపత్, దడిగె అనిల్,ఎండి.బాబా, కలకుంట్ల లోకేష్, పూర్ణచందర్ ,సుంకరి విక్రమ్, ఉట్కూరి సురేష్, అఖిల్, నవీన్ పాల్గొన్నారు.