Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చిరుమర్తి కిషన్ కుటుంబానికి రూ.2లక్షలు, ముంత సత్తయ్య కుటుంబానికి 2లక్షలు
అ ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సహాయం అందజేత
అ కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకుంటాం
నవతెలంగాణ- నార్కట్పల్లి
కష్టం వచ్చింది అంటే...! నేనున్నా అంటూ కొండంత అండగా నిలిచే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాల కు ఆర్థిక భరోసా కల్పిస్తూ రూ.4లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆదివారం మండలంలోని బ్రహ్మాణ వెల్లంలలో ఇటీవలి కాలంలో గుండె పోటుతో మరణించిన కోమటిరెడ్డి సోదరుల వీరాభిమాని చిరుమర్తికిషన్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తాను అండగా ఉన్న అని ధైర్యం చెప్పి రూ .2లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఇద్దరు పిల్లలకు చెరో లక్ష రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేయాలని సూచించారు. అదేవిధంగా మాజీ ఉపసర్పంచ్ ముంత సత్తయ్య కుటుంబ సభ్యులును పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊషయ్య , ఉప సర్పంచ్ వెల్లంల గోపాల్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు నల్లబోతు సత్తయ్య , సోమనబోయిన యాదయ్య , చిరుమర్తి ధర్మయ్య, ,గుత్తా నరేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.