Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐసీయూలోకి చొరబడి రోగిని చితకబాదిన వైనం
అ వీరంగం చేస్తున్నా పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది
నవతెలంగాణ -నల్లగొండ
పట్టణంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించిన 12గంటల్లోనే ఒక సైకో సెక్యూరిటీ గార్డు కండ్లు కప్పి ఆస్పత్రిలోకి చొరబడి ఐసీయూ కేంద్రంలోకి చొరబడి చికిత్స పొందుతున్న రోగిని చితకబాదిన సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుని కుటుంబ సభ్యులు, రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన మేడబోయిన శ్రీను తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.రెండు రోజుల క్రితం శ్రీనుకు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స చేయించుకుంటున్నాడు. కట్టంగూర్ మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్ చేస్తున్న విద్యార్థి బెజవాడ మహేష్ గతంలో కొనసాగిన మెడిసెంటర్ ఆస్పత్రిలో పనిచేశారు. అదే ఆస్పత్రిభవనంలో కొత్తగా నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో తనను తీసుకోనందుకు ఆస్పత్రి యాజమాన్యంపై కోపం పెంచుకుని మద్యం సేవించి ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆస్పత్రి వద్దకు వచ్చాడు. గేటు వద్ద ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులకు కండ్లు గప్పి మాయమాటలు చెప్పి, తాను ఈ ఆస్పత్రుల్లోనే పనిచేస్తున్నానని ఆస్పత్రిలోకి ప్రవేశించి నేరుగా ఐసీయూలోకి చొరబడి వీరంగం సష్టించి చికిత్స పొందుతున్న శీనుని నీవు ఇంకా ఎందుకు నిద్ర పొలేదురా అని చితకబాదాడు. అదే సమయంలో శ్రీను కేకలు వేయగా అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోలేదు.అదే సమయంలో పక్క వార్డులో ఉన్న పేషెంట్ బంధువులు 100 నంబర్‌కి ఫోన్ చేశారు. హుటాహుటిన టూటౌన్ పోలీసులు పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని హల్చల్ సష్టిస్తున్న మహేష్ ని అదుపులోకి తీసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. నిమ్స్ ఆస్పత్రి సూపర్వైజర్ మల్గి రెడ్డి అజరు రెడ్డి ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.