Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని పెద్దచెరువు భూమిని కొంతమంది తీగలు కట్టి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు.అధికారుల సమన్వయలోపం వలన భూములు కబ్జా గురవుతున్నాయి.గతంలో కూడా చెరువుశిఖం భూములను మట్టితోలి వాటిి రూపురేఖలు మార్చారు.అయినా అధికారుల సమన్వయలోపంతో విషయాన్ని గమనించలేదు.పెద్ద చెరువు సుమారు 700 ఎకరాల ఉండగా 100 ఎకరాల వరకు కబ్జాకు గురైంది.145 సర్వేనెంబర్లో ఈ తంతు సాగుతోంది. గతంలో అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకోవడంతోనే సరిపోయింది.తప్ప కనీసం పరిశీలించడానికి కూడా రాని పరిస్థితి నెలకొన్నది.అధికారులు ఇప్పటికైనా స్పందించి కోదాడ పెద్ద చెరువు కబ్జాకు గురికాకుండా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.
చెరువు కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం...
తాసిల్దార్ శ్రీనివాస శర్మ
చెరువు కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ శ్రీనివాస శర్మ అన్నారు. చెరువు కబ్జా కాకుండ్షా అధికారులు సమన్వయంతో పరిశీలిస్తామని తెలిపారు.