Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్దిరాల:యాసంగి లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అన్యాయమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ అన్నారు.ఆదివారం మండలకేంద్రంలోని ఆపార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులకు ముఖ్య పంట వరి అని కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయం వెనకకు తీసుకుని యాసంగి వరి పంట తీసుకుంటామని హామీఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుందూరువిష్ణువర్ధన్రెడ్డి, జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, సర్పంచులు దామర్ల వెంకన్న, వెలుగు వెంకన్న, నాయకులు వెంకటనర్సింహారావు, వడ్డాణం మధుసూదన్, రేసు వెంకన్న, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలఅధ్యక్షుడు గోల్కొండ మల్లేష్ పాల్గొన్నారు.