Authorization
Fri April 11, 2025 05:46:58 am
బొమ్మలరామారం : మండలంలోని రామలింగం పల్లి గ్రామాన్ని స్టేట్ లెవల్ విజిలెన్స్ అధికారులు సందర్శించారు.గ్రామంలోని డంపింగ్ యార్డు,తడి చెత్త,పొడి చెత్త, పల్లె ప్రకతి వనం,వైకుంఠ దామం,అంగన్వాడీ కేంద్రాలతో పాటు సానిటైజేషన్ ను. ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు.గ్రామంలో పరిశుభ్రతను చూసి సర్పంచ్ ఎంజాల కళ సత్యనారాయణను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఎర్వ హేమంత్ రెడ్డి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి స్వర్ణలత ,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.