Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
మండలంలోని దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద మోడల్ బస్ స్టాండ్ నిర్మాణానికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నల్లగొండ జిల్లా వైస్ గవర్నర్ తీగల మోహన్ రావు మాట్లాడుతూ చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఏర్పడ్డప్పటి నుండి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా జాతీయ రహదారి కి అనుకోని ఉన్న దేవాలయం దగ్గర బస్ స్టాండ్ నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి,ఉప సర్పంచ్ మల్కాజిగిరి కష్ణ,దేవాలయ అభివద్ధి కమిటీ సభ్యులు సిద్దిపేట శేఖర్ రెడ్డి,కార్యనిర్వహణాధికారి చిట్టెడి వెంకట్ రెడ్డి,లయన్స్ క్లబ్ సభ్యులు గోశిక కరుణాకర్, దాచేపల్లి ప్రకాష్,కాసుల వెంకటేష్,కటకం ప్రశాంత్,కామిశెట్టి భాస్కర్,గోపగోని లక్ష్మణ్,బొబ్బిళ మురళి పాల్గొన్నారు..