Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంగన్వాడీ యూేనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విజయలక్ష్మి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అంగన్వాడీ కేేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఐసీడీఎస్‌ను యథావిధిగా కొనసాగించాలని, కనీస వేతనం రూ.26 వేల నిర్ణయించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీలకు పెంచిన పిఆర్సి వేతనాలు ఏప్రిల్ నెల నుంచి చెల్లించాలన్నారు. సూపర్ వైజర్ పరీక్షను ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రకటించాలన్నారు. కేంద్రం పెంచిన వేతనాలు 2018 అక్టోబర్ నుంచి చెల్లించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ విడుదల చేయాలని, మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో యూనిఫామ్స్ ను, రిజిస్టర్, స్టేషనరీ డబ్బులు చెల్లించాలన్నారు. మతి చెందిన టీచర్ కుటుంబానికి రూ 30,000 చెల్లించాలని కోరారు. సెంటర్ పెండింగ్ ఇన్చార్జి అలవెన్సులు చెల్లించాలన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మంచాల మధు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలి వేరు రమాకుమారి, పద్మ ఉమా రుక్మిణి , షర్మిల, శారద, లక్ష్మి, శోభ, భాగ్యలక్ష్మి ,సునీత, జ్యోతి, ప్రమీల, హేమలత, విజయ, జంగమ్మ, వసంత పారిజాత సంతోష ,సరిత, అలివేలు, కవిత, మంగ ,అనిత, శ్యామల, విజయ పాల్గొన్నారు.